Hot Posts

6/recent/ticker-posts

ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్‌ భార్య ఆత్మహత్య..


హైదరాబాద్: తల్లి మరణించిన నాటి నుంచి మానసికస్థితి సరిగా లేక తీవ్ర మనోవేదనకు గురైన ఎస్‌బీఐ బ్యాంకు ఓ మేనేజర్‌ భార్య ఆత్మహత్య చేసుకుంది.By Posted BCN TV.. ఈ సంఘటన బేగంపేటలోని ఎయిర్‌లైన్స్‌ కాలనీ (Airlines Colony) లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన హరీష్‌ జి.ప్రభు రంజితపి.మలీయా(37) దంపతులు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరిష్‌ జి.ప్రభు ఎస్‌బీఐలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.


ఇటీవల అతనికి హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఫ్యామిలీతో నగరానికి వచ్చి బేగంపేటలోని ఎయిర్‌లైన్స్‌ కాలనీలోని కోరల్‌ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భార్య తల్లి మరణించింది. దీంతో రంజిత పి.మలీయా తీవ్రమనోవేదనతో అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటోంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు హరీష్‌ జీ.ప్రభు బ్యాంకుకు వెళ్లారు. కొద్ది సేపటికే అపార్ట్‌మెంట్‌కు చెందిన వారు ఫోన్‌ చేసి మీ భార్య భవనంపై నుంచి పడి చనిపోయిందని చెప్పడంతో ఇంటికిచేరుకున్నారు.

భవనం ఆరో అంతస్థు పైన ఉన్న టెర్రా్‌సపై నుంచి క్రింద పడడంతో రంజితపి.మల్లీయా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.