Hot Posts

6/recent/ticker-posts

ఎట్టకేలకు సింగరేణి సంఘాలకు ‘గుర్తింపు’


- గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ

- ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్‌టీయూసీకి హోదా
- సంఘాల నాయకులకు అందజేసిన సీఎండీ బలరాంనాయక్‌

గోదావరిఖని: సింగరేణిలోని కార్మిక సంఘాలకు గుర్తింపు, ప్రాతినిధ్య హోదాలు ఎట్టకేలకు దక్కాయి.. By Posted BCN TV.. గత సంవత్సరం డిసెంబరు 27న సింగరేణిలో సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్‌టీయూసీ విజ యం సాధించినప్పటికీ అధికారికంగా ఈ రెండు సంఘాలకు గుర్తింపు, ప్రాతిని ధ్య హోదా పత్రాలు అందలేదు. 

ఎన్నికలు నిర్వహించిన కార్మికశాఖ సింగరేణి ద్వారా హోదా పత్రాలు పొందాలని చెప్పడం, సింగరేణి తమకు సంబంధం లేద ని దాటవేయడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అంశంపై సింగరేణి యాజమా న్యానికి ఎలాంటి సూచన లేకపోవడంతో హోదా పత్రాలు అందజేసే ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీఎండీ బలరాంనాయక్‌ ఏఐటీయూసీకి గుర్తింపు హోదా పత్రాన్ని, ఐఎన్‌టీయూసీకి ప్రాతినిధ్య హోదా పత్రాన్ని అందజేశారు. 

ఐదు డివిజన్లలో మాత్రమే గెలిచినప్పటికీ ఏఐటీయూసీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సంపాదించి నందుకు గానూ ఏఐటీయూసీకి సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ గుర్తింపుప త్రాన్ని అందజేశారు. ఈపత్రాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అందుకున్నారు. ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా గుర్తింపు పొందిన ఐఎన్‌టీ యూసీకి హోదా పత్రాన్ని సీఎండీ అందజేశారు. ఈ పత్రాన్ని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌, కేంద్ర ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, జనరల్‌ సెక్రెటరీ త్యాగరాజన్‌ తదితరులు ఈ పత్రాన్ని స్వీకరించారు. 

దీంతో కార్మిక సమస్యలపై గర్తింపు సంఘంగా ఏఐటీయూసీ, గెలిచిన డివిజన్లలో ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్‌టీయూసీ సింగరేణి యాజమాన్యంతో వివిధ స్థాయిల్లో అధికారికంగా చర్చలు జరిపే అవకాశం ఏర్పడనున్నది. కార్యక్రమంలో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ డి శ్రీనివాసులు పాల్గొన్నారు. కాగా ఈ సంఘాలకు రెండు సంవత్సరాలు మాత్రమే ఈ హోదా వర్తిస్తుందని ఆ ధ్రువీకరణల్లో పేర్కొన్నారు. నాలుగేళ్లు గుర్తింపు హోదా కోసం న్యాయస్థానాల్లో పోరాడేందుకు ఏఐటీయూసీ సంసిద్ధం కానున్నది. ఎన్నికలు జరిగిన ఎనిమిది నెలల తరువాత కార్మిక సంఘాలకు గుర్తింపు హోదా లభించింది.