Hot Posts

6/recent/ticker-posts

రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత.. క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్


ఢిల్లీ : లోక్ సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ By Posted BCN TV.. అమెరికా పర్యటనలో.. సిక్కులపై చేసిన వ్యా్ఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు సిక్కు సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయంటూ ఆ పార్టీ సిక్కు సెల్ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో ఉన్న రాహుల్ గాంధీ ఇంటిని వారు ముట్టడించారు. రాహుల్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు.


తొలుత విజ్ఞాన్ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి రాహుల్ నివసిస్తున్న 10 జనపథ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు, పోలీసులకు తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. విదేశాల్లో ఆయన భారత్ పరువు తీస్తున్నారు. సిక్కుల తలపాగపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు" అని బీజేపీ నేత ఆర్‌పి సింగ్ అన్నారు. దేశంలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్సే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.

రాహుల్ ఏమన్నారంటే..
ఆర్ఎస్ఎస్ .. కొన్ని రాష్ట్రాలు, మతాలు, భాషలు, వర్గ ప్రజలను తక్కువ అన్న అభిప్రాయంతో చూస్తోందని రాహుల్ ఆరోపించారు. అలాగే భారత్‌లో సిక్కు మతస్థులను తలపాగా పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారో లేదో అని, సిక్కులకు గురుద్వారా వెళ్లనిస్తారో లేదో అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్నది రాజకీయ పోరాటం కాదని పేర్కొన్నారు.