- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల: భూకబ్జాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తానని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. భూకబ్జాలపై చేసిన ఆరోపణలకు పూర్తి ఆధారాలతో సహా వెల్లడిస్తున్నానంటూ.. By Posted BCN TV.. సోమవారం పట్టణంలోని ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే నెంబరు 149లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని, ప్రధానరహదారి కట్టాల్సిన ఆసుపత్రిని వెనక్కి కట్టారని ఆరోపించారు.
సర్వే నెంబరు 149లో 7ఎకరాల 33గుంటల భూమి ఉందన్నారు. అందులో మచ్చేందర్‌నాథ్ ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు సంబంధించిన సర్వే నెంబరు 149లో మూడు ఎకరాలు ఉందని, అందులో ఎకరా10గుంటలు మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సోదరి సద్గుణ కొనుగోలు చేశారని, అలాగే మరో ఎకరా8గుంటలకు అరుణ్‌కుమార్ కొనుగోలు చేసాడని వివరించారు. మిగిలిన 22గుంటలు రోడ్డు నిర్మాణంలో ఉందన్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టిన 22గుంటల భూమి రికార్డులో కొనసాగిందని, రెవెన్యూ రికార్డులో రౌండప్ కాలేదని, ఆ స్థలాన్ని అక్రమంగా మాజీ మంత్రి మేనల్లుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు.
అలాగే 3ఎక రాల 23 గుంటల భూమి బాలయ్య ప్రభుత్వం అసైన్డ్ చేసిందని వివరించారు. వీరిద్దరికి పోగా ఎకరా10గుంటలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ప్రభుత్వంకు చెందిన ఎకరా10గుంటల భూమిని మాజీమంత్రి మేనల్లుడు వద్ద పనిచేసే శివయ్య 2013లో అసైన్డ్ చేసినట్లుగా పహానీలో పేరు ఎక్కించారని ఆరోపించారు. 2013లో ప్రభుత్వం అసైన్డ్ చేస్తుందా అని ప్రశ్నిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగిందనేవిధంగా రికార్డులను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు.
శివయ్య పేరుపై నమోదైన ఎకరా10గుంటల భూమిలో రెండు గుంటల భూమిని నాగర్‌కర్నూల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కృష్ణయ్య విక్రయించినట్లుగా డాక్యుమెంట్స్ ఉన్నాయని వివరించారు. ప్రభుత్వంకు సంబంధించిన భూములను కబ్జా చేసి, ప్రహరీ నిర్మాణం చేసుకున్నారని ఆరోపించారు. జాతీయరహదారి నుంచి ఆసుపత్రికి రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని, రికార్డులను ట్యాంపరింగ్ చేసిన వారిని జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బంధువులు చేసిన భూ కబ్జాలను ఆధారాలతో సహా నిరూపించానన్నారు. కబ్జాల అంశంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నానని, కలెక్టర్ చర్యలు తీసుకుంటారన్నారు.
సమావేశంలో బాల య్య వారసులు మాట్లాడుతూ తమకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, బలవ ంతంగా రాయించుకుని భూములను లాక్కున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ఉండడానికి సరైన గూడు లేక ఇబ్బందుల్లో ఉన్నామంటూ సుక్కమ్మ, అంజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో బాదిమి శివకుమార్, నిత్యానందం, బుక్కవెంకటేశ్, బుర్లవెంకటయ్య, రబ్బానీ, అశోక్‌యాదవ్, అయ్యన్న, మినాజ్, యాదయ్య, రాజేందర్‌గౌడ్‌పాల్గొన్నారు.
Social Plugin