Hot Posts

6/recent/ticker-posts

బిల్లులు చెల్లించి పాడి రైతులను ఆదుకోండి


మిడ్జిల్‌: విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు రెండు నెలలుగా బిల్లులు రావడంలేదని సోమవారం కల్వకుర్తి, జడ్చర్ల ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.. By Posted BCN TV.. వారికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు పలికారు. ప్రైవేటు వ్యక్తులకు పాలు అమ్మితే వెంటనే బిల్లులు వస్తున్నాయని, విజయ డెయిరీ వారు ఎందుకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు. 


ప్రభుత్వం పాడిరైతుల విషయంలో మొండి వైఖరిని వీడాలని, ప్రోత్సాహకాలను అందజేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే బిల్లులను అందజేసేలా చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రాజునాయక్‌ ధర్నా వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. 

అనంతరం తహసీల్దార్‌ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సుదర్శన్‌, రవిందర్‌గౌడ్‌, తిరుపతి, శ్రీనివాస్‌గౌడ్‌, నారాయణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పట్నం బంగారు, జగన్‌గౌడ్‌, అంజియాదవ్‌, జంగయ్య, బంగారు, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.